డాక్టర్ ప్రియాంక అంతిమ యాత్రలో పాల్గొన్న

అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్

Aug 11, 2026 - 01:00
Aug 11, 2026 - 01:18
 0  2

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ప్రియాంక కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో ఐజ పట్టణంలో  ర్యాలీ.

హాజరైన మంత్రి జూపల్లి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్,ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.,

జోగులాంబ గద్వాల 10 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఐజా. మండలం ఎక్లాస్పురం గ్రామానికి చెందిన ప్రియాంక అనే వైద్య విద్యార్థిని ఆగస్టు 3వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాజమహేంద్రవరంలో ఒక కారు ఆక్సిడెంట్ లో  మృతి చెందడం జరిగింది.. ఆ వైద్య విద్యార్థిని మృతదేహం నేడు హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ కు చేరుకోగా అలంపురం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ.సంపత్ కుమార్  వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ తో మాట్లాడి పోస్టుమార్టం దగ్గరుండి జరిపించి, అక్కడే ఉండి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆంబులెన్స్ వెంట అలంపూర్ నియోజకవర్గమైనటువంటి ఏక్లాస్పురం గ్రామానికి బయలుదేరడం జరిగింది. 

అనంతరం ఐజా అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పట్టణంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చి ప్రభుత్వం తరఫున ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మాట్లాడి వారి కుటుంబానికి అండగా ఉంటామని మరియు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు మళ్లీ జరగకుండా పునరావృతం కాకుండా నిందితులకు శిక్ష పడేలా కఠినమైన చర్యలు తీసుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని  సంపత్ కుమార్ అన్నారు. అనంతరం సంపత్ కుమార్ ఐజా పట్టణ కేంద్రంలో  ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపడం జరిగింది.

డాక్టర్ ప్రియాంక కుటుంబం తనకి ఎంతగానో ఎన్నో ఏళ్లుగా చాలా సాన్నిహిత్యమైన కుటుంబమై వారి కుటుంబానికి ఇలాంటి రోజు రావడం చాలా దురదృష్టకరమని అన్నారు ఈ కాలంలో ఆడపిల్ల చదువుకోవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో చేతికిందిన వైద్య విద్యార్థిని ఇలా చేతిలో మృత్యువాత చెందడంమనేది అత్యంత బాధాకరమైన విషయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ తో పాటు మంత్రి జూపల్లి, గద్వాల శాసనసభ్యులు  కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప వైస్ చైర్మన్ కుమార్ మరియు ఐజా పట్టణ కౌన్సిలర్లు షేక్షావలి సులోచన, మైనర్ బాబు, ఆ మద్దిలేటి, వివిధ గ్రామాల సర్పంచులు,, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అఖిలపక్ష నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు , వైద్య విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State