రాయితీపై కంది విత్తనాలు మరియు మినప విత్తనాలు అందుబాటులో ఉన్నవి ఏవో రవికుమార్.
జోగులాంబ గద్వాల 11 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండలము లో రాయితీపై కంది విత్తనాలు మరియు మినుములు విత్తనాలు అందుబాటులో ఉన్నవి ఏవో రవికుమార్ వెల్లడించారు.
1. PRG-176 అను కంది రకము నాలుగు కేజీల ప్యాకెట్ పూర్తి ధర 520 రూపాయలు
రాయితీ 120 రూపాయలు రైతు చెల్లించవలసినది 400 రూపాయలు అందుబాటులో ఉన్న స్టాకు 141 ప్యాకెట్లు
2. LRG-52 అను కంది రకము
నాలుగు కేజీల ప్యాకెట్ పూర్తి ధర 520 రూపాయలు
రాయితీ 120 రూపాయలు
రైతు చెల్లించవలసినది 400 రూపాయలు అందుబాటులో ఉన్న స్టాకు 125 ప్యాకెట్లు
3. Asha అను కంది రకము
నాలుగు కేజీల ప్యాకెట్ పూర్తి ధర 520 రూపాయలు
రాయితీ 120 రూపాయలు
రైతు చెల్లించవలసినది 400 రూపాయలు అందుబాటులో ఉన్న స్టాకు 125 ప్యాకెట్లు
4. మినుములు విత్తనాలు VBN-8 రకము నాలుగు కేజీల పాకెట్ పూర్తి ధర 528 రూపాయలు. రాయితీ 120 రూపాయలు. రైతులు చెల్లించవలసింది 408 రూపాయలు. అందుబాటులో ఉన్న స్టాక్ 62 ప్యాకెట్లు
విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని ఏవో రవికుమార్ మండల ప్రజలని కోరుతున్నారు.