టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వం స్వీకరించిన సీనియర్ జర్నలిస్టు నరేందర్
సూర్యాపేట, 01 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- గత రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో వివిధ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రస్తుతం సూర్య దినపత్రిక సూర్యాపేట జిల్లా బ్యూరోగా కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్ట్ చనగాని నరేందర్ టియుడబ్ల్యూజే ఐజేయులో చేరారు. టి యు డబ్ల్యూ జే ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు నుంచి నరేందర్ సోమవారం టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వం తీసుకున్నారు.