తాగునీరు ప్రజలకు సౌకర్యార్థం సర్పంచ్ దేశ బోయిన నాగయ్య

Aug 5, 2026 - 21:45
 0  6
తాగునీరు ప్రజలకు సౌకర్యార్థం సర్పంచ్ దేశ బోయిన నాగయ్య

అడ్డగూడూరు 5 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానాయికుంట గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో రూ"2లక్షల వ్యయంతో నిర్మించిన నూతన వాటర్ ప్లాంట్‌ను సర్పంచ్ నాగయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నాగయ్య మాట్లాడుతూ..గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.చాలా కాలంగా గ్రామంలో వాటర్ ప్లాంట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఈ సౌకర్యం కల్పించినందుకు సర్పంచ్ నాగయ్యతో పాటు పంచాయతీ సెక్రటరీ కిరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడారి లింగమల్లు,పంచాయతీ సెక్రటరీ కిరణ్,వార్డు సభ్యులు మార్త వెంకన్న,మహేష్, యాదయ్య,కడారి రేణుక,బోడ సుస్మిత,ఎడ్ల భవాని,దేశ బోయిన ఐశ్వర్య,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీశైలం,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కడారి సైదులు,మాజీ సర్పంచ్ బోడ సుభద్ర వెంకటయ్య,గ్రామశాఖ అధ్యక్షుడు కొమ్మనమైన మహేష్,వెంకన్న,హరీష్,రవి, ప్రశాంత్,శ్రీను,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333