వాహనదారులకు అవగాహన కల్పించిన సిఐ రవి
అడ్డగూడూరు 12 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– రావన్నపేట సీఐ యం రవి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించి అడ్డగూడూరు చౌరస్తాలో సీఐ ఎం.రవి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ సూచించారు.హెల్మెట్,సీట్‌బెల్ట్ ధరించడం,మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం,అతివేగానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని,వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సీఐ ఎం.రవి కోరారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి,హెడ్ కానిస్టేబుల్ వెంకన్న,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.