సార్వత్రిక విద్యతో ఉన్నత చదువులకు సహకారం.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

Aug 11, 2026 - 16:52
 0  12
సార్వత్రిక విద్యతో ఉన్నత చదువులకు సహకారం.

జోగులాంబ గద్వాల 11 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. అనేక సమస్యల వల్ల చదువుకోలేక చదువును మధ్యలో ఆపేసిన వారికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య విధానం ద్వారా తిరిగి చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్ సి, ఇంటర్ లో ప్రవేశాల గోడపత్రికలను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఎస్ఎస్ సి లో చేరేందుకు ఆగస్టు 31 నాటికి 14 సంవత్సరాల వయస్సు నిండిన వారు అర్హులని, ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదన్నారు. ఇంటర్ కు సంబంధించి ఆగస్టు 31 నాటికి 15 సంవత్సరాల వయస్సు నుండి ఉండాలన్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని లేదా ఇతర బోర్డులలో ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా అర్హులని తెలిపారు. రెండింటికి గరిష్ట వయో పరిమితి లేదన్నారు. టాస్ ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయాల ద్వారా ఉన్నత చదువులకు అవకాశం ఉందని తెలిపారు. ఆసక్తి గల వారందరూ మరిన్ని వివరాలకు తమ సమీపంలోని దూర విద్య కేంద్రం సమన్వయకర్తను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. సంబంధిత వెబ్సైట్ ద్వారా ఈనెల 17వ తేదీలోగా, జరిమానాతో ఈనెల 29వ తేదీ వరకు ఆన్లైన్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి, టాస్ జిల్లా కోఆర్డినేటర్ సునీతమ్మ, డిఎంహెచ్వో సంధ్యా కిరణ్ మై.ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333