జి పి ఎల్ 5 క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన కొత్త వెంకట్రెడ్డి

Mar 24, 2026 - 20:08
Mar 24, 2026 - 20:11
 0  1
జి పి ఎల్ 5 క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన కొత్త వెంకట్రెడ్డి

25-03-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం.

చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో జి పి ఎల్–5 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించిన సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి.

చిన్నంబావి మండలం గూడెం గ్రామంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని జి పి ఎల్–5 క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను గ్రామ సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి ప్రారంభించారు.ఈ క్రికెట్ పోటీల్లో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతిగా రూ.20,000 మరియు షీల్డ్, రెండో బహుమతిగా రూ.15,000 మరియు షీల్డ్ అందజేయనున్నారు. మొదటి బహుమతిని సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి అందించగా, రెండో బహుమతిని ఎం. రవికుమార్ సాగర్ అందిస్తున్నారు. షీల్డ్ స్పాన్సర్‌గా డాక్టర్ ఎం. కృష్ణ యాదవ్ రూ.11,500 విరాళం ఇచ్చారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ మావిళ్ళపల్లి చక్రవర్తి రూ.10,000 సహాయం చేశారు. ఈ టోర్నమెంట్ మూడు రోజుల పాటు కొనసాగి, మార్చి 27న శ్రీరామనవమి రోజున విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ క్రీడా పోటీలు నిర్వహించబడుతూ గ్రామ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి.ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట బాలకృష్ణ, గుమ్మడం విష్ణు సాగర్, ఆర్ఎంపీ డాక్టర్ కృష్ణ యాదవ్, గుంటి నారాయణ, క్యాథూరి నరసింహ, కానిస్టేబుల్ సురేష్ బాబు, మూసినేని శివుడు, బత్తుల మోహన్, శ్రీరాములు సాగర్, పెద్ద నరసింహ, మక్బుల్ పాషా, మురళీధర్ సాగర్, భగవాన్ సాగర్, ప్రవీణ్ సాగర్, సురేందర్ యాదవ్, అల్లం శివుడు, కురుమయ్య యాదవ్, చిన్న నరసింహ, గోపాల్ యాదవ్, చిన్న ఉషన్, బాలకృష్ణ, శేఖర్ యాదవ్, చిన్న భాష, చాంద్ పాషా, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State