బిజెపి పార్టీ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం ర్యాలీ చేసిన బిజెపి నాయకులు

Aug 13, 2026 - 00:16
Aug 13, 2026 - 00:17
 0  0
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం ర్యాలీ చేసిన బిజెపి నాయకులు
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం ర్యాలీ చేసిన బిజెపి నాయకులు
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం ర్యాలీ చేసిన బిజెపి నాయకులు

అడ్డగూడూరు 12 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు,భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని వందేమాతరగీతం150సం" పూర్తిచేసుకొన్న సందర్బం పురస్కరించుకొని,స్వాతంత్ర్య సమరయోధుల అమూల్యమైన త్యాగాలను స్మరించుకుంటూ,దేశ ఐక్యత, సమైక్యతను చాటుతు భారతీయ జనతా పార్టీ అడ్డగూడూరు మండలశాఖ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ మహత్తర కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ననుబోతు సైదులు నియోజకవర్గ కోకన్వీనర్ కూరాకుల వెంకటేశ్వర రావు,జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరాకుల అరుణ,మండల ప్రధాన కార్యదర్శులు కొత్తోజు నవీన్,లింగాల నర్సింహా ఉపాధ్యక్షులు దేశబోయిన నాగరాజు,సీనియర్ నాయకులు లింగాల శ్యామ్ సుందర్ రెడ్డి,సోమిరడ్డి నర్సిరెడ్డి బూత్ అధ్యక్షులు మరాఠి మహేష్,యాదగిరి,మోర్చా, విభాగాల పదాధికారులు,  కార్యకర్తలు పుర ప్రముఖులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే ఈ తిరంగా ర్యాలీలో విద్యార్తులు పాల్గొని జాతీయ జెండా చేతభూని నినదించారు అనంతరం పాల్గన్న ప్రతి ఒక్కరికి జాతీయ జెండా ఇచ్చి వారి ఇంటిపై కట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినవారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.