కందూరు రామ్ రెడ్డి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐజ పట్టణం లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు
జోగులాంబ గద్వాల 7 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్ నియోజక వర్గం లో మొదటి రోజు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ హాజరయ్యారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సహకారం తో జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో ఐజ పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్ లు,కాంగ్రెస్ నాయకులు హాజరయ్యి నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారిని వైద్య శిబిరానికి తరలించి. పరీక్షలు చేయించడం జరిగింది. సంపత్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మార్వో ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళతో మాట్లాడి ఆపరేషన్ కి అవసరం అయ్యే రక్త పరీక్ష బీపీ షుగర్ టెస్టులకు కి అవసరం అయ్యే సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కౌన్సిలర్ లు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.