ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి
తిరుమలగిరి 24 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని అనంతారం గ్రామంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలకు వెళితే బుధవారం రాత్రి 11 గంటల సమయంలో తిరుమలగిరి-మోత్కూర్ రోడ్డులో నేషనల్ హైవే పై అనంతారం గ్రామం వద్ద తిరుమలగిరి నుండి అడ్డగూడకు బైక్ పై వెళ్తున్న వ్యక్తి అనంతారం గ్రామం వద్దకు రాగానే టీజీ 10సి 7835 నెంబర్ గల కారు అతివేగంగా నడుపుతూ వచ్చి బైకును వెనుకనుంచి బలంగా ఢీకొట్టగా బైక్ ను నడుపుతున్న వ్యక్తి బాలెంల మల్లు స్వామి (34) తండ్రి నరసింహ, అను వ్యక్తి అక్కడే రోడ్డుపై పడిపోయి తలకు తీవ్రంగా తగలడం తో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్, కారు లో ఉన్న ప్రయాణికులను గాయాలు అవ్వడంతో ఆసుపత్రి కి తరలించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతుడు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై గుత్తా వెంకట్ రెడ్డి తెలిపారు.