కొంపల్లి సరస్వతి  అనుమానస్పద మృతి పై విచారణ జరిపించాలి- PDSU

Jul 16, 2024 - 21:55
Jul 16, 2024 - 21:59
 0  8

సూర్యాపేట జిల్లా పెనుపహాడు మండలం దోసపాడు  BC గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న కొంపల్లి సరస్వతి విద్యార్థిని అనుమానస్పద మృతి అనేక అనుమానాలకు తావు తీస్తుంది తక్షణమే తన మృతి పై విచారణ జరిపించాలిని,  కారకులు అయినా వారిపై చర్యలు తీసుకొవాలిని మీడియాతో PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహద్రి, డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్ లు  మాట్లాడుతూ అన్నారు. విద్యార్థికి జ్వరం వచ్చిందని ఉదయం ఏడు గంటలకు సమాచారం ఇచ్చారంటూ  తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 జ్వరం వస్తే రెండు గంటల్లో  చనిపోయింది అని చెప్పడం అంటే అనేక అనుమానాలకు తావుతీస్తుంది. ఆరోగ్యంగానే చనిపోయిందా లేదా అక్కడ ఉన్నటువంటి మరొక ఏదైనా కారణాలు ఉన్నాయో పూర్తి   స్థాయిలో విచారణ జరిపించాలి.    నిర్లక్ష్యంగా ఉన్న ప్రిన్సిపాల్ ని, GNM ని సస్పెండ్ చేసి,సరస్వతి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గేషియ్ ఇవ్వాలి,ఒక్కరి ఉద్యోగం ఇవ్వాలి.  ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా జిల్లా అధికారులు  చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఒక సంవత్సర కాలంలోనే సూర్యాపేట జిల్లాలో 8 మంది విద్యార్థులు సంక్షేమ, గురుకుల హాస్టల్ లో చనిపోయారు. జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలన చేయకపోవడం మూలంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి . గురుకుల పాఠశాలలో కళశాలలు మరణాలకి కేంద్రాలుగా తయారవుతున్నాయి.   సూర్యాపేట జిల్లాలోని విద్యార్థుల వరస మరణాలపై  అధికార యంత్రాంగం  శ్రద్ధ చూపించి మరో సంఘటన జరగకుండా చూసుకోవాలని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333