ఆన్లైన్ మోసాల పట్లా అవగాహన మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఏయస్ఐ ఈశ్వర్
అడ్డగూడూరు16 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కేంద్రంలోని నేటి సమాజంలో జరుగుతున్న మోసాల గురించి పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.ఆన్లైన్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఇది ఆన్లైన్ మోసాల పట్లా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం రోజున సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో ఏయస్ఐ ఈశ్వర్ మాట్లాడుతూ జనాలు ఎవరు మోసపోవద్దని అన్నారు.
కొత్త పోన్ నెంబర్ లోనుండి అపరిచిత వ్యక్తులు పోన్ చేసినప్పుడు ఎవ్వరికీ కూడా ఓటిపి లాంటి నెంబర్లను దయచేసి తెలుపకూడదని అలాగే సోషల్ మీడియాలో నూతన యాప్ లపై దయచేసి నొక్క కూడదని అలా నోక్కితే ఎలాంటి ఓటిపిలు లేకుండా మీ ఖాతాలో ఉన్న డబ్బులు అట్టే మాయం అవుతాయని హెచ్చరించారు.అలాగే అల్లర్లు ప్రమాదాలు జరిగితే అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరిస్తే వెంటనే డయల్ 100 కి పోన్ చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానికి మండల నాయకులు పరమేష్ గూడెపు, పరుశరాములు,యువకులు పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రామనర్సయ్య,మహేష్ రాజు,శ్రీను, రజనికాంత్,జాన్బి తదితరులు పాల్గొన్నారు.