ఉత్తం పద్మావతి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ల పై మాజీ ఎమ్మెల్యే బొల్లం చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు
కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గం అని రంగాల్లో అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గాలుగా నిలుపుకున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి లపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు తెలిపారు గురువారం కోదాడ పట్టణంలో ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ దౌఖానాలో 24 గంటలు వైద్య సేవలతో పాటు అన్ని రకాల మందుల తోపాటు డాక్టర్లు నియమించి ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్న ఎమ్మెల్యే పై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మట్టి ఇసుక రవాణాలో జరిగిన అక్రమాలు గుర్తు చేసుకోవాలన్నారు ప్రభుత్వ సహకారంతో లిఫ్టులు రిపేరు చేయించి చివరి ఆయకట్టు భూములకు నీరు అందించిన ఘనత మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కాదా అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ప్రజా ప్రతినిధులు కవితను విమర్శించలేదని సాక్షాధారాలను బట్టికోర్టులుతీర్పుతెలుపుతాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో నాయకులు చందు నాగేశ్వరరావు రావెళ్ల కృష్ణారావు కౌన్సిలర్ ఎండి ఫాతిమా కాజా నెమ్మాది దేవమని పారా వెంకటేశ్వర్లు మైలారపు శెట్టి భాస్కర్ కందరబోయిన పెదవేలాద్రి పసుపులేటి నరసింహారావు సుంకర నాగయ్య లైటింగ్ ప్రసాద్ ముస్తఫా చింతపండు నరసింహారావు చందు సత్యం తదితరులు పాల్గొన్నారు.