లక్ష్మయ్య మరియు జుమ్మిలాల్ దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

Apr 29, 2024 - 21:12
 0  436
లక్ష్మయ్య మరియు జుమ్మిలాల్ దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

తిరుమలగిరి 30 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిరుమలగిరి మున్సిపల్ కేంద్రానికి చెందిన పలువురి వివాహ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన తుంగతుర్తి శాసనసభ్యులు సభ్యులు మందుల సామేల్. తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 

 గుండెపూరి గ్రామానికి చెందిన ఎంపిటిసి ధరావత్ జుమ్మిలాల్, పద్మ పెళ్లిరోజు వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు.. అలాగే సీనియర్ జర్నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇంచార్జ్ కందుకూరి లక్ష్మయ్య మంగ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొని వారిని ఆశీర్వదించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్. వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కలకాలం నవ దంపతులుగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య, సీనియర్ నాయకులు సుంకరి జనార్ధన్, కిష్టూ నాయక్, రాములు నాయక్, రాము గౌడ్, రవి నాయక్, కుమ్మం సతీష్, పానుగంటి గణేష్ వెంకన్న, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034