మీ ప్రాణం మా బాధ్యత
మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం...
గద్వాల పట్టణంలో ఆర్దరాత్రి డ్రైంక్&డ్రైవ్ తనిఖీలు
పలువురికి జరిమానాలు...
జోగులాంబ గద్వాల 1 జులై 2025 తెలంగాణ వార్తా ప్రతి ప్రతినిధి : గద్వాల. పట్టణంలోని కృష్ణవేణి చౌక్ దగ్గర గద్వాల పట్టణ ఎస్ కల్యాణ్,రూరల్ ఎస్ఐ శ్రీకాంత్,మల్దకల్ ఎస్ఐ నందికర్ అధ్వర్యంలో ఆర్దరాత్రి డ్రైంక్&డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు..ఈ సందర్బంగా పలువురికి జరిమానాలు విధించారు..మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని తెలుపుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని అలాగే శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు సహకారం ఎల్లవేళలా ఉంటుదని మీ ప్రాణాలు కాపాడుకోవడం మా బాధ్యత అని వారు తెలిపారు....