రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

రొండి శ్రీనివాస్ సిపిఎం మండల కార్యదర్శి

Feb 21, 2025 - 18:06
 0  2
రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

రొండి శ్రీనివాస్ సిపిఎం మండల కార్యదర్శి 

తెలంగాణ వార్త మాడుగులపల్లి ఫిబ్రవరి 18 :-మాడుగుల పెళ్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో రెడ్ బుక్ డే సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్ ,మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి కమ్యూనిజం చాలా అవసరం అన్నారు అలాగే మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో రైతులు పెట్టుకున్నటువంటి దరఖాస్తులు రిజెక్టుల పేరుతోటి చెత్తబుట్టలు నింపుతున్నాయి తప్ప రైతాంగ సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి లేదు అని. అలాగే మిస్సింగ్ సర్వే నెంబర్లు, మోటేషన్, సౌతీలు దరఖాస్తులు పరిష్కారం చేయమని రైతులు ఎన్నో విధాలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారే తప్ప పని అవుతున్న పరిస్థితి కనపడుటలేదు. క్షేత్రస్థాయిలో అధికారులు అన్యాక్రాంతంగా రికార్డులు మారిన వ్యక్తుల తోటి లాలూచిబడి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రైతాంగ సమస్యలను క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ చేసి వారికి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ చేపడతామని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు దేవి రెడ్డి అశోక్ రెడ్డి, శ్రీకర్, బొమ్మ కంంటి అంజయ్య,జూకురి నాగయ్య, వెంకట్ రెడ్డి నర్సిరెడ్డి ,వెంకటయ్య రవి, ఈ కార్యక్రమంలోతదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333