రేషన్ డీలర్ సస్పెన్షన్
తిరుమలగిరి 21 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని (2)రేషన్ షాప్ డీలర్ పందిరి వాసవి ని సస్పెండ్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 16న (2) తనిఖీ చేసి స్టాకులో వ్యత్యాసం ఉండ డాన్ని గుర్తించారు రేషన్ షాప్ డీలర్ పందిరి వాసవి ఐదు క్వింటాల బియ్యం అక్రమంగా విక్రహిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా విక్రహిస్తున్నందున రేషన్ డీలర్ ని అధికారులు సస్పెన్షన్ చేశారు. ఈ డీలరు సస్పెన్షన్ కావడంతో ఈదుల పర్రె తండాకు చెందిన డీలర్ రాములు కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రాజ్ నాయక్ తండ కు చెందిన ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా డిటిసిఎస్ ఇన్చార్జి విజయ్ శేఖర్ మాట్లాడుతూ పేదలకు అందవలసిన ఉచిత బియ్యాన్ని ఎవరైనా రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుండి అక్రమంగా కొనుగోలు చేసిన అమ్మిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు వీరితో తిరుమలగిరి ఎస్సై సురేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు