ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవం కార్యక్రమం
అయోడైజ్డ్ ఉన్న ఉప్పుని వాడదాం పిల్లలు ఆరోగ్యంగా జీవించే హక్కును కాపాడుదాం
జోగులాంబ గద్వాల 21 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ఈ రోజు . అక్టోబర్ '21 2024...ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవం జరుపుకున్న .. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ... ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ధరూర్ నందు " అక్టోబర్ '21 2024...ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవం " సందర్భంగా పి హెచ్ సి వైద్య ఆరోగ్య సిబ్బందికి , వివిధ గ్రామాల ఆశ కార్యకర్తలకు " అయోడిన్ రుగ్మతలపై సమీక్ష సమావేశం నందు పాల్గొన్న జిల్లా ఎన్ సి డి ప్రోగ్రాం ఆఫీసర్... డాక్టర్ జె సంధ్యా కిరణ్ మై.. ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.... అయోడిన్ కలిగిన ఉప్పుని వాడాలని...అయోడైజ్డ్ ఉప్పు వలన లాభాలను తెలిపారు.
మంచి శారీరక మానసిక ఆరోగ్యం, సరైన పెరుగుదల, చురుకుతనం, ఉత్సాహం, మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉండటం, సంగ్రహణ శక్తి పెరగడం, సక్రమంగా గర్భస్థ శిశువు పెరుగుదల, చదువుల్లో వయసుకు తగ్గ ప్రతిబను చూపడం.. వంటి లాభాలు ఉంటాయని.అయోడైజ్డ్ ఉప్పు వాడకపోతే కలిగే నష్టాలు గర్భ స్రావం, మృత శిశువు జననం, గొంతు వాపు గాయిటర్,అతి తక్కువ బరువుతో పుట్టే శిశువులు, మరుగుజ్జుతనం, చెవిటితనం మూగ తనం, బుద్ది మాంధ్యత, చదువులో వయసుకు తగ్గ ప్రతిభ చూపించలేకపోవడం.... వంటి నష్టాలు కలుగుతాయని... వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర Anm లకు మరియు ఆశా కార్యకర్తలకు తెలిపారు... మిగతా ఎన్సిడి ప్రోగ్రాం లపై అవగాహన కల్పించారు...
ఇట్టి కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్.. డాక్టర్ మాధవి, ఎన్ సి డి ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్, సి హెచ్ ఓ ఆనందయ్య, సూపర్వైజర్లు నర్సింలు, సుజాత, ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు....