రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం

May 20, 2026 - 19:51
 0  1
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహక పథకాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఈ నూతన విధానం ప్రకారం ఏ ప్రభుత్వ శాఖలోనైనా సరే, మీ నుండి కేవలం రూ.1000 లంచం డిమాండ్ చేసినా.. ప్రజలు సాక్ష్యాధారాలతో స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చు. లంచాలు అడిగే అధికారులపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసిన పౌరులకు ప్రభుత్వం తరఫున రూ.1,00,000 నగదు బహుమతి ఇస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇందుకోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1800 425 1555 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రవేశపెట్టింది.. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలను భాగస్వాములను చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333