రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న పసుపులేటి కరుణాకర్

తిరుమలగిరి 12 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్ :- మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే రాష్ట్రస్థాయి అవార్డును పసుపులేటి కరుణాకర్ కు గురువారం హైదరాబాదులోని ఈశ్వర్ భవన్ లో జరిగిన జయంతి ఉత్సవాలలో అందజేశారు. ఈ అవార్డును బీసీల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతు బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న నాయకులకు ఈ అవార్డును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహాత్మ జ్యోతిరావు పూలే నిర్మాణ కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, వివిధ బీసీ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.