రామప్ప శిల్పకళ వైభవం అద్భుతం.

Aug 20, 2024 - 21:00
Aug 20, 2024 - 21:02
 0  6

రూ.90 కోట్ల నిధులతో శృతి వనం ఏర్పాటుకు ప్రతిపాదనలు.

అన్ని హంగులతో రామప్ప రిజర్వాయర్ అభివృద్ధి.

పర్యాటక ప్రాంతాలలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం.

పర్యాటకంనకు అత్యధిక నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.

అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న  కాకతీయ కట్టడాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు.

ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుందని, జిల్లాలోని కాకతీయ కట్టడాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 

రానున్న రోజులలో ములుగు జిల్లా పర్యాటక ప్రాంతంగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు లతో కలిసి వెంకటాపూర్ మండలంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామిని  దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా  ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి  వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎనమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన రామప్ప ఆలయం నేటికి చెక్కుచెదరకుండా ఉందని, అప్పటి కాకతీయులు వారి మేధస్సును వినియోగించి భారీ రాయిలతో శిల్పాలను చెక్కి అద్భుతంగా అమర్చారని ఇలాంటి కట్టడాలు నేటి సమయంలో కట్టను ఎవరి తరం కాదని అన్నారు. ఇక్కడి ప్రాంతంలో పర్యటించే పర్యాటకులకు కనీస వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నామని, రామప్ప సరస్సులో నీరు సమృద్ధిగా ఉండటం సంతోషకరమని అన్నారు. ప్రతి నెలలో  ఎమ్మెల్యే లు, మంత్రులు ఒక్కసారైనా పర్యాటక ప్రాంతాల్లో పర్యటించాలని దీంతో మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని అన్నారు. ఇక్కడి పర్యాటక  ప్రాంతాలను జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

మంత్రి సీతక్క మాట్లాడుతూ 90 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా యంత్రాంగం ద్వారా మంత్రికి నివేదిక సమర్పించడం జరిగిందని, 14 సంవత్సరాల క్రితం లక్నవరంలో ఉయ్యాల వంతెన ఏర్పాటు చేయడంతో పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తుందని అదే తరహాలో రామప్ప సరస్సులో ఉయ్యాల వంతెన ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. 

రామప్ప ప్రాంతంలో ప్రసాద్ పథకం ద్వారా పనులు కొనసాగుతున్నాయని, గోదావరి పరిహక ప్రాంతాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలోని రామప్ప, లక్నవరం సరస్సులు ఉండగా, మేడారంలోని 
శ్రీ సమ్మక్క సారలమ్మ ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. రామప్ప లో పర్యాటకులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు రిజర్వాయర్ ను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని అన్నారు.

ములుగు జిల్లాల్లో అందమైన అడవులు , పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, గోదావరి పరివాహక ప్రాంతాల చుట్టూ ఉన్న కట్టడాలను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక శాఖను అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్., ఎస్పి షభరిష్, 
డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ కే. సత్య పాల్ రెడ్డి, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు, జిల్లా మండల అధికారులు  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333