తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప మేధావి జయశంకర్ సార్

Aug 6, 2024 - 16:36
Aug 6, 2024 - 17:37
 0  38

తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు  సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

 సూర్యాపేట టౌన్, ఆగస్టు 6:- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప మేధావి ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ సార్ అని  తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు.  మంగళవారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ జిల్లా కార్యాలయంలో హాజరై ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఆంధ్ర పాలకుల చేతుల్లో నలుగుతున్న తెలంగాణ దుస్థితిని తన రచనల ద్వారా తెలంగాణ ప్రజలకు అందించిన చరిత్రకారుడు జయశంకర్ సార్ అని కొనియాడారు.

 నీళ్లు, నిధులు ,నియామకాల విషయంలో దగా పడుతున్న తెలంగాణ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించిన ఉద్యమకారుడు అని గుర్తు చేశారు. మిలియన్ మార్చ్ వంటి తెలంగాణ పోరాటానికి సారథ్యం వహించి రాజకీయాలకతీతంగా అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహా నాయకుడు అని చెప్పుకొచ్చారు. తెలంగాణ నే శ్వాసగా తెలంగాణనే  లక్ష్యంగా బ్రతికి ఎంతో మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు ఆచార్య కొత్త పెళ్లి జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిది. బంగారు తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాటయోధుడు ఆయన.  ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ఆయన ప్రజలను ముందుండి నడిపించారు.   ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారు దేవత్ కిషన్ నాయక్  జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి రియల్ ఎస్టేట్ జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ ఉపాధ్యక్షులు ఖమ్మం పాటి అంజయ్య, గౌడ్ విజయ్ నాయక్,     తదితరులు పాల్గొన్నారు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333