రాజ్యాంగంపై జరుగుతున్న దాడి ఇదీ

Jul 20, 2024 - 19:25
 0  3
రాజ్యాంగంపై జరుగుతున్న దాడి ఇదీ

 -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిబంధనలు యదేచ్చగా తుంగలో తొక్కారని రాజ్యాంగ విలువలను నాశనం చేస్తున్నారని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాష్ట్ర గవర్నర్ ను కలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు తదితరులు హాజరయ్యారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు తుంగలో తొక్కారని కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగులపై దాడులు కేసులు దాడులు జరుగుతున్నాయి. ఒక భయానక వాతావరణాన్ని హైదరాబాదులో సూచించింది ప్రభుత్వం అని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. మొదటి సంవత్సరంలోని రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం కానీ గతంలో భర్తీ చేసిన 30000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఉద్యోగాలు మాత్రమేనని తెలిపారు. జాబ్ క్యాలండర్ ఉంటే ఇస్తామని హామీ నిలబెట్టుకోలేదు. సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చి అరెస్టులు చేశారు. హోమ్ శాఖ కార్యదర్శిని పిలిచి మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వాన్నిఅడుగుతానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు.రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఖననంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని,  పార్టీ ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేశామని, పదిమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందని తేదీలతో సహా గవర్నర్ కు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరో పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై గవర్నర్ కు వివరించామని, ఈ రెండు అంశాలపై గవర్నర్ కు సుదీర్ఘంగా తమ అభ్యర్థన వినిపించామని తెలిపారు. ఎన్నికలపై ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరుగుతుంది. మిమ్మల్ని ఎవ్వరికి కూడా కనీసం నియోజకవర్గాల్లో గౌరవం దక్కడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరినీ ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కలుస్తాం. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఈ విషయంపై వివరిస్తామని  గవర్నర్ కలిసిన అనంతరం మీడియా తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333