శ్రీకృష్ణుడు చూపిన జ్ఞానమార్గంలో నడుద్దాం

ఘనంగా మురళీధరుడి ఊరేగింపు వేడుక

Sep 5, 2024 - 20:13
 0  20
శ్రీకృష్ణుడు చూపిన జ్ఞానమార్గంలో నడుద్దాం

అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మానవులంతా శ్రీకృష్ణుడు చూపిన జ్ఞానమార్గంలో నడిచినప్పుడే ముక్తి లభిస్తుందని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ అధ్యక్షుడు పోటు వెంకటేశ్వర్లు అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలో చైతన్య హైస్కూల్ దగ్గర పోటు వెంకటేశ్వర్లు, పోటు జయవాణి దంపతుల నివాసంలో జరుగుతున్న వేడుకలు కృష్ణప్రతిమను పల్లకీలో ఘనంగా ఊరేగించడంతో ముగిశాయి. ఈ సందర్భంగా కోదాడ శాఖ అధ్యక్షుడు పోటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడిని అడ్డం పెట్టుకొని మానవాళికి అవసరమైన జ్ఞానాన్ని మనకు అందించడం జరిగిందన్నారు. మోక్షం పొందేందుకు శ్రీకృష్ణుడు చూపిన జ్ఞానమార్గం మినహా ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవన్నారు. శ్రీకృష్ణుడి జ్ఞానబోధ మట్టిలో మాణిక్యం మాదిరిగా ఇప్పటి వరకు ఎవరికీ అర్ధంకాలేదన్నారు. శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడి నిజభావం బహిర్గతమైందన్నారు. నేటి ఆధునిక మానవులు ఎవరైనా త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథం చదవడం ద్వారా మోక్ష మార్గం తెలుసుకోగలుగుతారన్నారు. ధర్మం అంటే మతానికి సంబంధించింది కాదన్నారు. ధర్మం అనే పదాన్ని దేవుడి విషయంలో మాత్రమే ఉపయోగించాలన్నారు. ధర్మాల గురించి భగవద్గీత గ్రంథంలో వివరంగా బోధించబడ్డాయన్నారు. ప్రతి ఒక్కరూ కుల, మతాలకు అతీతంగా త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథం చదివి తెలుసుకోవచ్చన్నారు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలోని ప్రజలకు దేవుడి జ్ఞానం తెలిసి ఉండేదన్నారు. ఆ విషయాన్ని గుర్తించిన ఇతర దేశాల మానవులు భారతదేశాన్ని ప్రత్యేకంగా ఇందువుల దేశం అని, ఇందూ మహా సముద్రం అని ప్రత్యేకంగా పిలిచేవారన్నారు. ఇందు అంటే చంద్రుడు అనే అర్ధం వస్తుందన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు జ్ఞానానికి అధిపతి కాబట్టి దేవుడి జ్ఞానం తెలిసినవారిని ఇందువు అని పిలిచేవారన్నారు. ఇందువు అనే పదం కాస్తా అర్ధరహితమైన హిందువు అని మారిపోయిందన్నారు. హిందువు అంటే అర్ధం లేదన్నారు. హిందువు అనే పదం కుట్రపూరితంగా మనకు తగిలించబడిందన్నారు. హిందువు అంటే బేవకూఫ్ అనే అర్ధం వస్తుందని పలువురు స్వామీజీలు సైతం ప్రసంగాల్లో బోధించినప్పటికీ మనం పెడచెవిన పెట్టడం దురదృష్టకరం అన్నారు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు బహిర్గతం చేసి 100 గ్రంథాల రూపంలో బ్రహ్మవిద్యాశాస్త్రాన్ని సంపూర్ణంగా అందుబాటులోకి తెచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ త్రైత సిద్ధాంత గ్రంథాలు చదవడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకోవచ్చన్నారు. పట్టణంలో శ్రీకృష్ణుడి ప్రతిమను పల్లకీలో ఉంచి ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపులో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఊరేగింపు వేడుకతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ముగిశాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333