మహిళా కూలీలతో రాయల మాట ముచ్చట...!
పాలేరు ప్రతినిధి/తెలంగాణవార్త...ఆగస్టు 20 మంగళవారం
తిరుమలాయపాలెం మండలం తాళ్లచెర్వు గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మహిళా కూలీలతో మంగళవారం మాట్లాడారు. వ్యవసాయ పనులు,ఏ పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ పై వారిని అడుగగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడం పట్ల ప్రభుత్వనికి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.