కమనీయం.. రమణీయం ..అంగరంగ వైభవంగా
లక్ష్మీ చెన్నకేశవ స్వామి మాస కళ్యాణం
సూర్యాపేట రూరల్ (పిల్లలమర్రి) డిసెంబర్ 12: మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో గురువారం ఉదయం ఉత్సవమూర్తులకు అర్చకులు రఘువరన్ ఆచార్యులు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ చైర్మన్ గూకంటి రాజబాబు మాట్లాడుతూ ప్రతినెల వైభవంగా మాస కళ్యాణం నిర్వహిస్తామని భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈనెల 16 నుండి ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఆలయంలో ఘనంగా జరుగుతాయని ప్రతి ఒక్కరు గోదాదేవి అమ్మవారు ఆనతిచ్చిన తిరుప్పావై పాశురాలను పటిస్తూ అనునిత్యం ఆధ్యాత్మిక వాతావరణంలో దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయ అభివృద్ధిలో భక్తుల సహకారం ఎంతో ముఖ్యమని ఆలయంలో జరిగే విశేష కార్యక్రమాలకు భక్తులు ధన వస్తు రూపేణ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రతి శుక్రవారం స్వామివారికి విశేష పుష్పాలంకరణ సేవ ప్రతినెల ఏకాదశి పర్వదినాన శాంతి కళ్యాణం రెండవ శనివారం సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి సహస్ర దీపాలంకరణ సహిత ఊంజల్ (ఉయ్యాల ) సేవ మరియు పర్వదిన వేడుకలు ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామని పై సేవలలో భక్తులందరూ పాల్గొని తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముడుంబై సారిక గూగంటి స్వరూపారాణి గవ్వ అహల్య సువర్ణ అంకం బిక్షం మల్లీశ్వరి గవ్వ జానకి రెడ్డి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.