**రంజాన్ పండగను పురాతన పద్ధతిలో గుర్రంపై వెళ్లిన""కాంగ్రెస్ పట్టణ మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ నజీర్*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ: *రంజాన్ పండుగను పురాతన పద్ధతిలో గుర్రం పై వెళ్లిన పట్టణ మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ నజీర్*
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముస్లింల ఆరాధ్య దైవం రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కోదాడ పట్టణ ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ నజీర్ మాత్రం పురాతన పద్ధతి లో గుర్రం పై వచ్చి మషిద్ కు వెళ్ళిదర్షించుకొని అందరినీ ఆశ్చర్య పరిచాడు .రంజాన్ పండుగ గురించి మాట్లాడుతూ ముస్లింలు ఎంతో భక్తితో రంజాన్ మాసంలో ఒక్కపొద్దులతో ఉండి మాసం పూర్తి అయిన తర్వాత నెల పొడుపు చూసి రంజాన పర్వదినాన్ని జరుపుకోవడం ఎంతో పుణ్యంగా భావింప బడుతుందని అలాంటి ఈ పండుగను పూర్వీకుల పద్ధతిలో గుర్రం పై వెళ్లి ఇష్ట దైవాన్ని దర్షించుకున్నందున్న తన మనస్సుకు ఎంతో ఆనందం అనిపించిందని అన్నారు గుర్రం పై తాను వచ్చిన సన్నివేశాన్ని చూసి ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారన్నారు.