మోడీ పాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిదాం. PDSU -PYL

Mar 17, 2024 - 21:01
 0  6
మోడీ పాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిదాం. PDSU -PYL

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ మోడీ పాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిదాం. PDSU -PYL ఈ సభకు అధ్యక్షత PYL జిల్లా కోశాధికారి బండి రవి వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూIFTU జిల్లా ఉపాధ్యక్షులు కొనుకుంట్ల సైదులు,PYL జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య, పాల్గొని  ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని గురుకుల జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ లో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి సందర్భంగా సభ నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భారతదేశ విముక్తి కోసం, స్వేచ్చా స్వాతంత్ర్యం కోసం తమ విలువైన ప్రాణాలను భారత జాతికి అంకితం ఇచ్చారు. ఉరితాడును ముద్దాడి అమరులయ్యారు. భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్పూర్తితో యువత యువజన పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా, రష్యా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. దేశంలో రోజురోజుకీ మతోన్మాదం, ఫాసిజం పెరుగుతుంది అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో విఫలం అయ్యాయన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత పెడదారి పడుతున్నారన్నారు. సమానత్వం, సమసమాజకోసం జరుగుతున్న పోరాటంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వేచ్చా, స్వాతంత్ర్యం కోసం దోపిడీ, పీడన లేని నూతన వ్యవస్థ కోసం యువతీ యువకులు తిరుగుబాటుకి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు పిడమర్తి భరత్, రమేష్, కుంట రవి, తదితరులు పాల్గొన్నారు.