రంగారెడ్డి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో ఆత్మకూరు ఎస్ విద్యార్థిని మేడి అనూష

Sep 13, 2024 - 19:27
Sep 13, 2024 - 19:45
 0  7
రంగారెడ్డి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో ఆత్మకూరు ఎస్ విద్యార్థిని మేడి అనూష

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- రంగారెడ్డి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో ఆత్మకూరు ఎస్ విద్యార్థిని మేడి అనూష ఆత్మకూరు ఎస్.. తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ 60 మీటర్ల పరుగు పందెంలో ఆత్మకూరు మండలానికి చెందిన మేడి అనూష ప్రథమ స్థానంలో ఎంపికయింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ లో జరిగిన సబ్ జూనియర్ అండర్ 16 బాలికల అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 60 మీటర్ల పరుగు పందెంలో అనుష విజయం సాధించింది. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన మేడి నాగయ్య కుమార్తె అనూష హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. రంగారెడ్డి జిల్లా స్థాయి లో ఎంపికైన అనూష సెప్టెంబర్ 19,20,21తేదీలలో హైదరాబాద్ 10 వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో పాల్గొననున్నది. అనూష ఎంపిక పట్ల పలువురు అభినదించారు.