యువతను మోసగించిన బిజెపిని ఓడించండి.. కోల రమేష్
మునగాల 30 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014 సాధారణ ఎన్నికల సమయంలో బిజెపి పార్టీ,నరేంద్ర మోడీ దేశ యువతకు చేసిన వాగ్దానం అమలు చేయకుండా యువతను మోసగించిదని అలాంటి మతతత్వ పార్టీ బిజెపిని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ పిలుపునిచ్చారు.ఈ రోజు మునగాల మండలం నేలమర్రి గ్రామంలో జరిగిన డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, గత పదేండ్లుగా బీజేపీనే కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్న మోడీ ,బిజెపి మాట మార్చి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు.మోడీ ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? అని యువత ప్రశ్నిస్తే, పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగం లాంటిదేనని, దేశ యువతను అవమానించేలా మాట్లాడారనీ తెలిపారు.బిజెపి పాలకులు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసగించినందుకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని యువతను కోరారు. ఇచ్చిన మాట ప్రకారం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి, నిరుద్యోగ యువత నోట్లోమట్టి కొట్టింది ఎవరు మోడీ కాదా? అని ప్రశ్నించారు.పచ్చి అబద్ధాలు, మోసపూరిత మాటలే తప్ప ఉద్యోగాల జాడలేదనీ,మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాటప్ ఇండియా అనే మోసపూరిత నినాదాలతో ప్రచార ఆర్భాటమే తప్పయువతకు జరిగిన ప్రయోజనం శూన్యమన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా యువతను నట్టేటముంచింది.స్వాతంత్ర్య అనంతరం దేశంలో ఎన్నడూ లేని విధంగా, బిజెపి పదేండ్ల పాలనలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లోనే ఎక్కువ నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. బిజెపి 10 ఏళ్ల పాలనాకాలంలో విద్యా ఉపాధి ఉద్యోగ కల్పనకు చర్యలు చేపట్టకుండా నిరంతరం మత విద్వేషాలు భావోద్వేగాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించిందన్నారు.మరొక సారి ఎన్నికల్లో మత ఉద్రిక్తలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందన్నారు. దేశ రక్షణ కొరకు రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కుల కొరకు బిజెపిని ఓడించాల్సిన అవసరం ఉందని యువతను ఉద్దేశించి అన్నారు అందుకనే యువత చైతన్యవంతంగా ఆలోచించి బిజెపిని ఓడించాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు బచ్చలకూర సురేందర్,బచ్చల కూర సికిందర్,సోమపంగు సూర్య తేజ,సాయితేజ,గోపి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.