అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ వార్త కొండపాక:- వెంకటరామిరెడ్డి భారీ మెజార్టీతో గెలవాలి* ....
వేలేటి రాధాకృష్ణ శర్మ
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్
ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండపాక మండలం బందారం మరియు రాంపల్లి గ్రామాలలో బారాస కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి అనంతుల ప్రశాంత్, రైతుబంధు సమితి మాజీ కోఆర్డినేటర్ రాగాల దుర్గయ్య, మాజీ ఎంపీపీలు బొద్దుల కనకయ్య, రాధా కిషన్ రెడ్డి, నాయకులు జైపాల్ రెడ్డి లు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు.
6 గ్యారంటీలు అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు పాలన అందించడంలో ఫెయిల్ అయిందని అన్నారు.
పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో సబండవర్ణాల సంక్షేమం కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు.
రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నమ్మిన ప్రజలను నట్టేట ముంచిందన్నారు. రాష్ట్రంలో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజలను మోసం చేస్తున్న బిజెపి పార్టీలను ఎండగట్టి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలంటే అది ఒక బి ఆర్ ఎస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న వెంకటరామిరెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. 100 కోట్ల రూపాయల సొంత నిధుల తో పేద ప్రజల కోసం ట్రస్టు ఏర్పాటు చేస్తానని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వెంకటరామిరెడ్డి కి ప్రజల మద్దతు ఉంటుందన్నారు. వెంకటరామిరెడ్డి విద్యావంతుడు చదువుకున్న వ్యక్తి సమాజం పట్ల ఇక్కడ ప్రజల పట్ల పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి అలాంటి వెంకటరామిరెడ్డి ని గెలిపిస్తే ఇక్కడి ప్రజల కోసం ఇక్కడి ప్రాంత ప్రయోజనాల కోసం పార్లమెంట్లో అనర్గళంగా కొట్లాడి మెదక్ పార్లమెంటుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని అన్నారు. మేం గడపగడపకు ప్రచారానికి వెళితే దేవుని లాంటి కెసిఆర్ ను దూరం చేసుకున్నందుకు బాధపడుతున్నామని ఈ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో నరకం అనుభవిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ అయితేనే శ్రీరామరక్ష అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పెద్ద సాయిగారి యాదగిరి, గురజాడ బాలాజీ, సీనియర్ నాయకులు మంద శ్రీనివాసరెడ్డి, దోమల ఎల్లం, గొట్టే ఐలయ్య పిల్లి నాగరాజు గురజాడ బాలాజీ బందారం గ్రామ అధ్యక్షులు నీల వెంకటేష్, బట్ట వెంకటేష్, ఏ మల్ల రాజిరెడ్డి, కాసాపురం సంజీవరెడ్డి, రాముల యాదగిరి, దొమ్మాట మైపాల్ రెడ్డి, బాల బ్రహ్మం, చిట్కుల సురేందర్ రెడ్డి, ఎలుక రాజిరెడ్డి, సీత యాదగిరి, గుడిమల్ల బాలరాజు, పిఎసిఎస్ డైరెక్టర్ బాల నర్సయ్య, జిర్ర రాజు, మంతూరి రాములు, దోమల శ్రీశైలం, పల్లె బాబు, చింతల శ్రీనివాస్, కోడెల మల్లేశం, పెరుగు ఆంజనేయులు తోపాటు బందారం మరియు రాంపల్లి గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.