యువకుడు ఆత్మహత్య
జోగులాంబ గద్వాల19 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మానవపాడు మండలం బోరవెల్లి స్టేజి సమీపంలోని జాతీయ రహదారి వద్ద గురువారం అప్పుల బాధ తాళలేక గురువారం మోహన్ బాబు (23) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజోలి మండలం నరసనూరు గ్రామానికి చెందినవాడు కాగా.. ఐజ మండల కేంద్రమైము లో రెడీమేడ్ షాపును నిర్వహిస్తున్నాడు. దీనిపై మానవపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారికి ఒక ప్రకటనలో తెలిపారు.. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది