మానాయకుంటలో గ్రామంలో ఘనంగా సిపిఐ శతజయంతి ఉత్సవాలు

Dec 27, 2024 - 18:04
 0  68
మానాయకుంటలో గ్రామంలో ఘనంగా సిపిఐ శతజయంతి ఉత్సవాలు

అడ్డగూడూరు 27 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- డిసెంబర్ 30న నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అడ్డగూడూరు మండలం మానాయికుంట గ్రామంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఉప్పుల శాంతి కుమార్ ఎర్రజెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1917లో రష్యాలో జరిగిన మహా విప్లవం స్ఫూర్తితో మన దేశంలోని యువకులు ఆకర్షతులై కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు నిర్ణయించి1925 డిసెంబర్ 26న మన దేశంలో కమ్యూనిస్టు అభిప్రాయాలు కలిగిన వారు దేశ నలుమూలల నుండి కాన్పూర్  లో సమావేశమై భారత కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.ఆనాటి నుండి  నేటి వరకు దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా  ప్రజల పక్షాన నిలబడి ఎన్నో త్యాగాలు చేసి కార్మిక కర్షక  శ్రమజీవుల కొరకు ఎన్నో మహాతర పోరాటాలు  సుదీర్ఘమైన పోరాటాలతో స్వతంత్ర తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్లో పనిచేసింది తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా  హైదరాబాద్ సంస్థాన రాచరిక ప్యూడల్ పాలన బద్దలుకొట్టి  భారత యూనియన్ లో వీలినం చేయటంలో  ప్రధాన పాత్ర వహించింది అని అన్నారు.సిపిఐ పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 30వ తేదీన నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ బోడ వెంకటయ్య సిపిఐ గ్రామ శాఖ నాయకులు ఎడ్ల వెంకటయ్య,చిర్రబోయిన ఆవిలమల్లు,తీగల సైదులు,చిప్పలపల్లి వంశీ కుమార్,గ్రామస్తులు కొమ్మనబోయిన మధు,తీగల ఉషాన్  బోడ అంజయ్య,బోడ చిన్న వెంకయ్య, ఉప్పుల సైదులు,కడారి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333