మా ఊరికి దారేది
దీక్ష విజయవంతం జాతీయ రహదారులపేరుతోప్రజల్నివంచిస్తున్న ప్రభుత్వాలు!? నేలకొండపల్లి: జాతీయ రహదారుల పేరుతో ప్రభుత్వాలు ప్రాణాల్ని వంచిస్తూ, కార్పోరేట్ శక్తులు,పెట్టుబడిదారులకు ఏజెంట్లుగా సేవ చేస్తున్నాయని ఆమ్ఆద్మీపార్టీ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు, ప్రముఖ కవి, రచయిత నల్లమోతు తిరుమల రావు విమర్శించారు.బుధవారం ఆమ్ఆద్మీపార్టీ ఆద్వర్యంలో పసుమర్తి శ్రీనివాస్ చేపట్టిన మాఊరికి దారేది ? జాతీయ రహదారి అప్రోచ్ రోడ్డు కొరకునిరసన దీక్ష లను ఆయన ప్రారంబించి ప్రసంగించారు.మాఊరికి దారేది పేరుతో శ్రీనివాస్ ఒకరోజు నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు.ప్రజల భూములు గుంజుకొని,టోల్ టాక్స్ పేరుతోఏళ్ళతరబడి జేబులు కొల్లగొట్టడం కోసం అవకాశం కల్పిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు సౌకర్యం గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు.ఆదానీ,అంబానీ,మెగా కృష్ణ రెడ్డి లాంటి కార్పోరేట్ శక్తులచేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మలు గా మారాయని దుయ్యబట్టారు.జాతీయ రహదారి పేరు ప్రభుత్వాలకు, లాభాలు కార్పోరేట్ శక్తులకు, భూ నిర్వాసితులు గా, బాధితులుగా,సౌకర్యాలు లేనివారు గా ప్రజలు ఉండాలా? అని ప్రశ్నించారు.పేదప్రజల నాణ్యమైన ఉచిత విద్యా, వైద్యం గురించి పట్టించుకోని ప్రభుత్వాలు కమీషన్లు కోసం కార్పోరేట్ శక్తులకు దళారీలు గా మారి సేవ చేస్తున్నాయని విమర్శించారు మ.పసుమర్తిశ్రీనివాస్ మాఊరికి దారేది? పేరుతో చేస్తున్న నిరసన దీక్ష కు అన్నివర్గాలు మద్దతు తెలపాలని కోరారు.ఆయనదీక్షను మనసారా అబినందించారు.ప్రముఖపర్యాటకకేంద్రం, చారిత్రక ప్రాధాన్యం గల పట్టణం నేలకొండపల్లి,ఆసియా ఖండంలో నే పెద్ద బౌద్ధ స్తూపం,భక్తరామ దాస్ జన్మస్థలం, రైల్వేస్టేషన్, రైతులకు ప్రయోజనం ,విస్తరించిన గ్రానైట్ పరిశ్రమ,చెరుకుకర్మాగారంతదితర ప్రాదాన్యత లరిత్య నేలకొండపల్లి పట్టణం వద్ద నేషనల్ హైవే కి అప్రోచ్ రోడ్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.భవిష్యత్లో ఈవిషయం లో జరిగే ఆందోళన లో ప్రజలు, ప్రజాస్వామ్య శక్తులు కలిసిరావాలని ఆయన కోరారు.ఈఆందోళనా కార్యక్రమం ను ఆమ్ఆద్మీపార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ బలపర్చుతుందని ఆన్నారు.ఈకార్యక్రమంలో ఆమ్ఆద్మీపార్టీ ఖమ్మం జిల్లా అద్యక్షులు స్వర్ణ సుబ్బారావు , ఆప్ జిల్లా సహాయ కార్యదర్శి సిద్దెల రాంబాబు, సిపిఎం నాయకులు కొత్తారమేష్,మందడపు మురళి,కె వి రెడ్డి,అభిషేక్,బిఅర్ స్ నాయకులు నాగుబండి శ్రీనివాస్,యుండి వాజీద్,బసిరెడ్డి,కాంగ్రెస్ నాయకులు జేసిబికృష్ణా,యంయల్ పార్టీ నాయకులు పగిడికత్తులరాందాస్ తదితరులు ప్రసంగించారు వికలాంగుల సంక్షేమం సంఘం నేత కర్ణాకర్, ఆచార్యుల గూడెంమాజీ సర్పంచ్ శ్రవణ్,రైతు నాయకులు వీరారెడ్డి, రామయ్య,పైనంపల్లి గ్రామ నాయకులు చలమయ్య,నాయకులు నాచేపల్లి గ్రామం కాకనూరి మల్లికార్జునరాజేశ్వరాపురం నాయకులు,రావుపాల్గొన్నారు.రెండు గంటల పాటు జరిగిన దీక్ష కు 476 మంది సంతకాలు చేసి సంఘీభావం తెలపటం హర్ష నీయం.