బస్సులో మహిళా మృతి
తిరుమలగిరి 3 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి వద్ద ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మహిళా మృతి చెందింది వివరాలకు వెళితే నాగారం మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన జట్టంగి యాదమ్మ (50) గుండెనొప్పి వస్తుందని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి బయలుదేరింది నాగారం నుండి బస్సులో ప్రయాణించగా సమీపంలోని అర్వపల్లి వద్ద మృతి చెందింది కొద్దిసేపటి క్రితమే బస్సు ఎక్కిన ఆమె ఇంతకీ పిలిచిన పలకకపోవడంతో గమనించిన స్థానికులు బస్సు నిలిపివేసి పల్స్ చెక్ చేశారు అనంతరం ఆమెను సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించారు