డోన్ వైపు మిల్క్ స్పెషల్ రైలుకు ఎదురుగా నిలబడి యువకుడు ఆత్మహత్య

జోగులాంబ గద్వాల 8 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈరోజు తెల్లవారుజామున అందాజ 3 గంటల ప్రాంతంలో మేళ్లచెరువు గ్రామానికి చెందిన బోయ రవి, 23 సంవత్సరాలు గ్రామ సమీపంలోని రైలు పట్టాలు వద్దకు చేరుకుని కాచిగూడ నుంచి డోన్ వైపు వెళ్లే మిల్క్ స్పెషల్ రైలుకు ఎదురుగా నిలబడిఆత్మ హత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తుల కథనం ప్రకారం మృతుడు గత ఏడు సంవత్సరాల నుండి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసినది. మృతుడు అవివాహితుడు. ఇతనికి తల్లి జ్యోతి తండ్రి కృష్ణ వివాహితులైన ఇద్దరు అక్కలు కలరు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడం జరిగిందని. G. రామకృష్ణ రైల్వే హెడ్ కానిస్టేబుల్ గద్వాల్ వారు తెలిపారు.