**మహాత్మ జ్యోతిబా పూలే వేడుకలు""కోదాడ కె ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ :కే.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతీబా పూలే జయంతి వేడుకలను ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి, తెలుగు లెక్చరర్ వేముల వెంకటేశ్వర్లు సమన్వయకర్తగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించిన అనంతరం అధ్యాపకులు ఆర్. పిచ్చి రెడ్డి మాట్లాడుతూ... మానవ హక్కుల కోసం మొట్టమొదటిసారిగా గళ
మెత్తిన సంఘసంస్కర్త, మహా పురుషుడు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం ఉద్యమించిన మహోన్నతుడు జ్యోతిబాపూలే అని అందరూ ఆయన బాటలో పయనించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి అన్నారు. తెలుగు ఉపన్యాసకులు వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఆనాడు భారతీయ స్త్రీల విముక్తికై సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి స్త్రీల విద్య కోసం శ్రమించిన బహుజనుల దైవం పూలే అన్నారు. ఆయన జీవితం దళిత బహుజనులకు ఆచరణ యోగ్యంమని కార్మిక హక్కుల కోసం తొలిసారిగా ఉద్యమించిన తొలితరం నాయకులు పూలే అని ఆయన కొనియాడారు. జ్యోతిబా పూలే పోరాట స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగించడానికి యువతరం చైతన్య స్ఫూర్తితో పయనించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుండా యాదగిరి, రేపాకుల గురవయ్య, ఈ. నరసింహారెడ్డి, ఎన్. జ్యోతిలక్ష్మి, ఆర్. చంద్రశేఖర్, టి.మమత, డి. ఎస్. రావు మొదలగువారు పాల్గొన్నారు.