ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్*

Apr 10, 2025 - 23:50
Apr 10, 2025 - 23:52
 0  9
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్*

మద్దిరాల 10 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలంలో వివిధ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో గుమ్మడవెల్లి,కుక్కడం,మద్దిరాల, కుంటపల్లి రెడ్డిగూడెం, రామచంద్రాపురం, ముకుందాపురం,జి కొత్తపల్లి, చిన్ననిమిల,చందుపట్ల వివిధ గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం రోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన వడ్లను తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన సన్నాలకు బోనస్ తో కలిపి 2820 దొడ్డు ధాన్యానికి 2320 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది కనుక దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ నాగం జయసుధ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముక్కాల అవిలమల్లు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ,కిషన్ రావు,పచ్చిపాల సుమతి వెంకన్న,ఎమ్మార్వో అమీన్ సింగ్,ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి,ఏపిఎం మైసయ్య,అగ్రికల్చర్ ఏపీసి సిబ్బంది ఏవో సీసీలు నాగిరెడ్డి రమేష్ ఏవో అనుష రుహీ ఏఈఓ అనుష అధ్యక్షులు కార్యదర్శి ఐకెపి సిబ్బంది ప్రజా ప్రతినిధులు అధికారులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు మరియు కార్యకర్తలు రైతులు హమాలీలు తదితరులు పాల్గొన్నారు.