మహనీయుల వారసత్వాన్ని రేపటి తరానికి అందించడం మన చారిత్రక బాధ్యత.
నేటి తరం ఆ సామాజిక బాధ్యతను విస్మరిస్తే ఎలా ?
మరింత మెరుగైన సమాజ నిర్మాణానికి ఆ కృషి తప్పనిసరిగా జరగాలి .
--- వడ్డేపల్లి మల్లేశం
గత తరం, నడుస్తున్న కాలానికి సంబంధించి వివిధ రంగాలకు చెందిన విజ్ఞులు , తత్వవేత్తలు, కవు లు, కళాకారులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు వైద్య రంగ నిపుణులు,జర్నలిస్టులు, సమాజాన్ని ప్రభావితం చేసిన వారికి సంబంధించిన చరిత్రను భవిష్యత్తు తరానికి అందించవలసిన బాధ్యత నడుస్తున్న కాలానికి ఉంటుంది.
ప్రాధాన్యత అంశాలు భిన్నంగా ఉంటాయి కనుక ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చకపోవచ్చు కానీ సార్వ జనీనా అంశాలు వారసత్వంగా భావితరాలకు అందించకపోతే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది .ఆయా కాలాలకు సంబంధించి నడుస్తున్న చరిత్రను రికార్డు చేయడం నిలువ ఉంచడం పంపిణీ చేయడం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి . ఈ క్రమంలో ఏ మాత్రం తేడా వచ్చినా సామాజిక పెడదొరనులు విస్తృతమవుతున్న నేపథ్యంలో అంధకారమే తప్ప ఆసక్తులు అంతగా కనిపించకుండా పోయే ప్రమాదం ఉంటుంది కనుకనే ఈ చీకటిని తరిమి కొట్టడానికి , వెలుతురును అందిపుచ్చుకోవడానికి ,గతంలోని మంచిని వర్తమానంలోనీ ఆసక్తిని పరిశోధనలను భావితరానికి అందించడానికి కృషి జరగవలసిన అవసరం ఎంతగానో ఉంటుంది అది నడుస్తున్న చరిత్ర యొక్క నడుస్తున్న కాలానికి సంబంధించిన చారిత్రక బాధ్యత.
వర్తమాన కాలానికి సంబంధించి ఈ బాధ్యతను గత వారసత్వాన్ని మనకు అందించిన కొద్దిమంది మహానుభావుల వలన ప్రేరేపించబడి స్ఫూర్తి పొంది ప్రభావితులమై బాధ్యతలను గుర్తించి కర్తవ్యాన్ని సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకుంటున్నాము.
వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి త్యాగం ప్రేమాభిమానాలు మానవ సంబంధాల పటిష్టతకు కృషి చేయడంతో పాటు ఆ వాస్తవము కనుమరుగు కాకూడదని అందులోని నిజాన్ని విప్పి చెప్పడానికి కొంతైన ప్రయత్నం చేస్తున్నా అది ఒక క్రమ పద్ధతిలో జరగకపోవచ్చు కానీ ఎక్కడి వాళ్ళు అక్కడ ఏదో ఒక రూపంలో తమకు తెలిసిన విషయాన్ని రేపటి తరం కోసం పంపిణీ చేయడానికి ప్రసారం కావించడానికి ప్రయత్నం గనుక చేస్తే ఆలోచన ఉదయిస్తుంది , త్యాగం మొలకెత్తుతుంది , కర్తవ్యం కలుషితం కాకుండా భవిష్యత్తు కొంతవరకైనా మెరుగైన సమాజం వైపు దూసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే కదా మనం ఆలోచించేది .
నేటి తరం సామాజిక బాధ్యతను విస్మరించకూడదు:-
********
యాంత్రికంగా జీవించడం వేరు ఇతరుల గురించి ఆలోచించి సాధ్యాసాధ్యాలు మంచి చెడుల ఫలితాలు పరిణామాలను విశ్లేషించడం వేరు పుట్టుక నుండి చావు మధ్యన ఉన్న జీవితాన్ని అర్థవంతం చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలను పునికి పుచ్చుకోవడమే నిజమైన జీవితం అవుతుంది . అక్కడ ఏమాత్రం తప్పటడుగు వేసిన, బాధ్యతలను గుర్తించకపోయినా, స్వార్థానికి తలవంచిన , త్యాగాన్ని బాధ్యతను విస్మరించిన అది సమాజానికి చేసిన ద్రో హమే అవుతుంది . నేరం చేయకపోయినా జరుగుతున్న అనర్థాన్ని కల్లా రా చూసి కూడా మౌనంగా ఉండి స్పందించకుండా తన బాధ్యతను విస్మరించే ప్రతి వాళ్లు కూడా నేరస్తులే అనే సామాజిక న్యాయ సూత్రాన్ని ఇక్కడ మన జీవితానికి అన్వయి 0చుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది . బుద్ధుని సమానత్వాన్ని అశోకుని అహింసను అక్బర్ పరమత సహనాన్ని భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ , ఉ ద్ధం సింగ్ , చంద్రశేఖర్ ఆజాద్ వంటి స్వాతంత్ర పోరాట వీరుల చరిత్రను భావి తరానికి మరింత ప్రేరణగా అందించవలసిన అవసరం లేదా ? భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో జరిగినటువంటి జాతుల పోరాటాలు , జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉనికి కోసం జరిగిన యుద్ధాలు , నిజాం రాజు దౌస్ట్యా లతో పాటు స్థానిక భూస్వాములు దేశముకులు రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అసువులు బాసిన, తమ జీవితాలను పన0 గా పెట్టిన తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగ ఫలాన్ని ఎలుగెత్తి చాటకపోతే మనం ద్రోహులం కామా? స్వాతంత్రం సాధించిన నుండి నేటి వరకు సమానత్వం స్వేచ్ఛ స్వాతంత్రాల ఆలంబనగా పాలించిన పాలకులు ప్రజల పక్షాన పనిచేసి తమ జీవితాలను సర్వస్వం ఒడ్డీ చిత్రహింసలు జైలు పాలైనా మొక్కవోని ధైర్యంతో లక్ష్యాన్ని మోస్తున్నటువంటి బుద్ధి జీవులు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు చేస్తున్న త్యాగం సామాన్యమైనదా ?మార్క్స్ స్టాలిన్ లెనిన్ మావో ఎంగేల్స్ వంటి మహోన్నతుల సామాజిక సమానత్వాన్ని ఆశించే పెట్టుబడి దారి వ్యతిరేక ఆలోచన ప్రాంతం ఏదైనా దేశమేదైనా స్వేచ్ఛ కోసం జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా అంతర్జాతీయ పోరాట వీరుడు చేగువేరా భారతదేశంలో జన్మించి బహుజనులు అస్పృశ్యుల కోసం మానవాళి మనుగడ కోసం నిద్దుర లేని రాత్రులు ఎన్నో గడిపి కుటుంబాన్ని పక్కనపెట్టి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల ప్రతినిధిగా జీవించిన విషయాన్ని చెప్పకపోతే ఎలా ? రాజ్యాంగాన్ని రచించడంమే కాదు మహిళలు కార్మికులు సబ్బండ వర్గాల ప్రతినిధిగా అంబేద్కర్ అందరివాడు అని ముద్ర పడిన మహోన్నతుడు అంబేద్కర్ జీవితాన్ని అందించకపోతే ఎంతో నష్టం . సమానత్వం , స్వేచ్ఛ , జ్ఞానం , సామాజిక చైతన్యం కోసం జీవితాలను ధారబోసిన సావిత్రిబాయి పూలే జ్యోతిబాపూలే కుటుంబ త్యాగాలు మరిచిపోగలమా? స్వతంత్ర పోరాటంలో అతివాదులతోపాటు మిత వాదులుగా కొనసాగితే గాంధీ ఆ వర్గానికి ప్రతినిధిగా అహింసా పూరితంగా చేసిన పోరాటాన్ని మరిచిపోగలమా? సిద్ధాంతాలు ప్రతిపాదించి చర్చోప చర్చలు చేసి సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమయోచితంగా విశ్లేషించి తపన పడ్డవాళ్ళు నాటి నుండి నేటి వరకు ఎందరో ఎందరెందరో!
తమ ఆటపాటల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల బాధ్యతలను గుర్తింపజేసి హక్కులకై పోరాడుతూ పోరాటాన్ని సజీవంగా ఉంచిన కవులు కళాకారులు సాహితీవేత్తలు సామాజిక కార్యకర్తలు కోవలో 2023 ఆగస్టు 6 తేదీన మరణించిన ప్రజా యుద్ధనౌక భారతదేశంలోనే సామాజిక అవగాహనతో శాస్త్రీయ చింతనతో ప్రజా సమస్యల పైన అలవోకగా పాటలల్లి అంబేద్కర్ భావజాలంలో విప్లవ చైతన్య స్ఫూర్తిని నింపుకొని బహుజన వాదాన్ని కార్మిక కర్షక మహిలా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన గద్దర్ రాసిన పాటలు సృజించిన సాహిత్యం ఆంగ్లభాషలోకి గనుక అనువదించబడితే ప్రపంచ స్థాయి ఉత్తమ సాహితీవేత్తగా గుర్తింపు వచ్చేది అని ప్రముఖ సాహితీవేత్త బహుజన ఉద్యమకారుడు ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యక్తం చేసిన అభిప్రాయం గద్దర్ యొక్క పోరాట స్ఫూర్తికి సామాజిక చైతన్యానికి సజీవ సాక్ష్యం.శ్రీకాకులపో రాటం ,నక్షల్బరి లాంటి ఉద్యమాలలో వేల సంఖ్య లో అమరులు, ప్రస్తుతం ఆయా రంగాలలో కొనసాగుతున్న మహానుభావుల యొక్క జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా సందేశాలుగా విద్యార్థులకు పాఠాలుగా నేర్పించాల్సిన అవసరం చాలా ఉన్నది. అక్కడనే సజీవ ఆలోచన మొలకెత్తుతుంది, సాహిత్యం విచ్చుకుంటుంది , సామాజిక బాధ్యత మొగ్గ తొడుగుతుంది. అది మెరుగైన సమాజ నిర్మాణానికి ఆనవాలుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అందుకే నేటి తరం తను ఆకలింపు చేసుకున్న అన్ని అంశాలను రేపటి కోసం పంచి పెట్టాలి . రేపటి మెరుగైన సమాజ నిర్మాణానికి అది తప్పనిసరి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం) ఊరు