మచ్చ సందీప్ కు ఘన నివాళి

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మచ్చ సందీప్ కు ఘన నివాళులు అర్పిస్తున్నట్టు బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూళిపాళ ధనుంజయ నాయుడు చేశారు శనివారం నాడు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కోదండ రామపురం గ్రామంలో జరిగిన మచ్చ సందీప్ సంతాప సమావేశానికి హాజరైన సందీప్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరంఆయన మాట్లాడుతూ ....
రోడ్డు ప్రమాదంలో అకాల మర ణానికి గురైన సందీప్ మరణం కుటుంబానికే కాక మొత్తం గరిడేపల్లి మండలానికి తీరని లోటు అని, ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో రాత్రిపూట పశువులు వదిలివేయడం వల్ల అనేక మంది మృత్యువాత పడ్డారని అలాగే గాయాల పాలయ్యారని, అందువల్ల రాత్రి పూట పోలీసు పహార ఉంచాలని పశువులను రాత్రిపూట వదిలివేసే యజమానుల పైన కేసులు నమోదు చేయాలని, గాయాల పాలైన వారికి తక్షణ వైద్య సహాయం అందించే విధంగా ఒక అంబులెన్స్ ను ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి ఉంచి తక్షణ వైద్య సౌకర్యం కల్పించి విలువైన ప్రాణాలు కాపాడాలి ఆయన సూచించారు.
కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి కోమర్రాజు వెంకట్ ధూపాటి అనిల్ కళ్యాణ్ , దళిత హక్కుల పోరాట సమితి నాయకులు మంద బిక్షంపరికే వివేక్ ఉన్నారు