మా పంటలు పండాలంటే  బిక్కీరులోకి నీరు వదలాలని ప్రాంత రైతులను ఎండిన పొలంలో నిరసన మందు డబ్బాలతో జానకిపురం గ్రామ రైతులు

Mar 5, 2025 - 20:39
 0  84
మా పంటలు పండాలంటే  బిక్కీరులోకి నీరు వదలాలని ప్రాంత రైతులను ఎండిన పొలంలో నిరసన  మందు డబ్బాలతో జానకిపురం గ్రామ రైతులు

 అడ్డగూడూరు 5 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో మందు డబ్బాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఆరుగాలం కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై వేసిన పంట కళ్ళముందే ఎండుతుంటే ఆ రైతు బాధ మాటలో చెప్పలేనిది. యాసింగి పంటకు నీరు లేక భూగర్భ జలాలు ఎండిపోవడం తో బికేరు వాగుపై ఎన్నో ఆశలతో పంటలు వేసిన రైతుల బాధ వర్ణాతితం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు కృషి ఫలితంగా బీర్ల ఐలయ్య సహకారంతో గత ఫిబ్రవరి నెలలో బిక్కేరు వాగులో కి నీరు వదలడం జరిగింది.దీనితో ఆ పరిసర ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.కానీ వారం రోజులు మాత్రమే నీరు వదలడంతో మోత్కూరు,సదర్ షాపూర్,చెక్ డ్యాముల వరకు మాత్రమే నీరు అందింది దిగువన ఉన్న చిన్న పడిశాల,జానకిపురం, వస్తా కొండూరు,తాటిపాముల, చిర్రగూడూరు,బిక్కేరు పరిసర ప్రాంత రైతులకు నిరాశే ఎదురుపడింది.రైతులు వేసిన వరి పంట నీరు లేక ఎండిపోతుంటే చూస్తూ ఉండడం తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేవు బిక్కిరు నే నమ్ముకున్న రైతులకు నిరాశే మిగిలింది. దీనితో ఏమి చేయలేని స్థితిలో రైతులు ఎండిన పంటను పశువులను మేపడం జరుగుతుంది.తమ బాధను పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నాడు అడ్డగూడూరు మండలం జానకిపురం గ్రామంలో రైతులు ఎండిన పంటలో నిలుచొని మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు.రైతు బిడ్డ  రైతు కష్టం తెలిసినటువంటి మందుల సామేలు ఇప్పటికైనా తమ గోడును పట్టించుకోని మరో 10 రోజులపాటు బిక్కీరులోకి నీరును వదిలినట్లయితే తమ ప్రాంత చెక్ డ్యాములు నిండి  యాసంగు  పంట చేతికి అందుతుందని రైతులు అన్నారు.లేనియెడల తమకు ఆత్మహత్యలే గతి అని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక మంత్రులు, శాసనసభ్యులు,రైతుల గోసను చూస్తూ ఉండకుండా రైతులను కాపాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పచిమట్ల వెంకటయ్య,పంజాల అంజయ్య, అంబటి సమ్మయ్య,చింత వెంకటయ్య,బోనాల అశోక్, బాబు,పంగిడియ్య,శ్రీకాంత్,నవీన్,వెంకన్న, వెంకటయ్య, మహేందర్, తదితర రైతులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333