అడ్డగూడూరులో ఘనంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

Jun 1, 2025 - 19:41
 0  60
అడ్డగూడూరులో ఘనంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

అడ్డగూడూరు 01 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం యూత్ కాంగ్రస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..నిత్యం ప్రజల కోసం అరాటపడే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ పదవులను త్యాగం చేసిన వ్యక్తులు కోమటిరెడ్డి బ్రదర్స్ అని కొనియాడారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ ను కాపాడేదే కోమటిరెడ్డి సోదరులని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వల్లంభట్ల రవీందర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,లక్ష్మీదేవికాల్వ మాజీ సర్పంచ్ నారగోని అంజయ్య గౌడ్,గూడెపు పాండు,కప్పల రాజేష్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి, గూడెపు నాగరాజు,మారిశెట్టి మల్లేష్,షకీల్,మోర్రి శ్రీనివాస్ యాదవ్,రాచకొండ సతీష్, ప్రవీణ్,మాజీ సర్పంచ్ యేసు రత్నం,బిక్షం రెడ్డి,కమ్మంపాటి కుమార్,లింగస్వామి,నవీన్, యూత్ కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333