మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని విమర్శించే స్తాయి బిఆర్ఎస్ పార్టీకి లేదు

Aug 23, 2024 - 17:00
 0  333
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని విమర్శించే స్తాయి బిఆర్ఎస్ పార్టీకి లేదు

తిరుమలగిరి 24 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సొంత గ్రామంలో ఏం చేయాలేదని పత్రికలలో ఆరో పనలు చేసే స్థాయి బిఆర్ఎస్ నాయకులది కాదని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎర్ర యాదగిరి అన్నారు. శుక్రవారం మండలంలోని తాటిపాముల గ్రామంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ ఉత్తంకుమార్ రెడ్డి దేశానికి సేవ చేసిన వ్యక్తి అని తన సొంత నియోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన మంత్రి అన్నారు. కమిషన్ లకు కక్కుర్తి పడి సంపాదన కోసం ఆరాటపడే వ్యక్తి కాదని, అది బి అర్ ఎస్ నాయకులు గుర్తు ఎరగాలని చెెప్పారు. తాటిపాముల గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయించింది ఉత్తంకుమార్ రెడ్డి అని, విద్యుత్ సమస్య ఉంటే ఇప్పటికే 25 కె.వి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గ్రామంలో ఇటీవలనే బిగించారని, అంతేకాకుండా తాటిపాముల ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించడానికి అధికారులు పంపించే సర్వే చేపించారని ఒక్కొక్క పనులు చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్నారని చెప్పారు.బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు కమిషన్లు తన సొంత ఆస్తులు పెంచుకోవడానికి పనిచేశారని,ఏమేం చేసినారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఆరోపించేది ఒక రెండు టిఆర్ఎస్ పార్టీకి చెందిన రెండు కుటుంబాలకు నాయకులె అని చెప్పారు. వారి ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి అప్పు ఉన్నది కాబట్టి రుణమాఫీ రాలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశారని చెప్పారు. రుణమాఫీ రాని రైతులు ఏవో దగ్గరికి వెళ్లి వారికి దరఖాస్తు చేసుకున్నట్లయితే రుణమాఫీ చేస్తారని చెప్పిన టిఆర్ఎస్ నాయకులు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, రైతులు వీళ్ళ మాట నమ్మడం లేదని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయని కృష్ణ, నాయిని నర్సయ్య,  కృష్ణయ్య, వీరస్వామి, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034