మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని రేసులో వంగాల డానియల్

కాంగ్రెస్ మండలపార్టీ అధ్యక్ష పదవిని మాదిగలకివ్వాలి.....
పార్టీలో చిన్నా పెద్ద నేతలతో కలివిడిగా ఉండే గుణం....
గతంలో మండల, నియోజకవర్గం స్థాయిలో ఎస్సి సెల్ ఇంచార్జి గా పనిచేసిన అనుభవం....
తిరుమలగిరి 16 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో అయిదో వార్డు మాలిపురం గ్రామానికి చెందిన వంగాల డానియల్ తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల పార్టీ అధిష్టానానికి తన అభ్యర్థన పత్రం దాఖలు చేసినట్టు తెలిపారు. తాను ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని సామాన్య కార్యకర్త స్థాయి నుండి గ్రామ శాఖ అధ్యక్షునిగా, ఎస్సి సెల్ మండల అధ్యక్షునిగా, నియోజకవర్గం ఇంచార్జి గా ఎదిగిన తీరులో పార్టీ పెద్దలు, ప్రతీ ఒక్కరి సహాయ సహకారం ఉందన్నారు. కార్యక్రమం ఏదైనా పార్టీ పిలుపునిస్తే ముందుండి పోరాడే తత్త్వం తనదని, వార్డు, గ్రామ, మండల స్థాయిలో చిన్నా పెద్ద తేడా లేకుండా ఆపదలో ఆదుకునే గుణం తనదన్నారు. ప్రజా సమస్య లపై ప్రశ్నిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా మంచి గుర్తింపు ఉందన్నారు. సందర్భమేదైనా పేద ధనిక తేడా లేకుండా ప్రజలకు తనవంతు సహాయంగా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం తృపినిస్తుందన్నారు. తాను ప్రత్యక్షంగా ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినా గానీ కాంగ్రెస్ పార్టీ వీడని పరిస్థితి. జిల్లా స్థాయి నాయకులతో సత్సంబంధాలు కలిగి, మండలం లోని ప్రతి గ్రామ అధ్యక్షులు, కార్యకర్తల తో కలిసి పోయే స్నేహ పూర్వక గుణం తనదన్నారు. పార్టీ అధిష్టానం తనకు తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవినిస్తే మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలను కలుపుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని అన్నారు.