భూభారతి పై అవగాహన సదస్సులు

తెలంగాణ వార్త ఆత్మకుర్ ఎస్ రెవెన్యూ సదస్సులు ఆత్మకూర్ ఎస్... భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు బుధవారం మండల పరిధిలోని కందగట్ల, కోటపాడు గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సు నిర్వహించారు. రెవిన్యూ సదస్సులో రైతుల నుండి పిర్యాదు లను సేకరించారు.ఈ సందర్భంగా భారీగానే దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ అమీన్ సింగ్ ఆర్ ఐ లు ప్రదీప్ రెడ్డి, స్వప్న, ఎంఇఓ ధారాసింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.