డ్రైవర్ ప్రమాద భీమా 5లక్షల రూపాయల చెక్కును అందజేసిన

Aug 27, 2026 - 20:07
 0  1
డ్రైవర్ ప్రమాద భీమా 5లక్షల రూపాయల చెక్కును అందజేసిన
డ్రైవర్ ప్రమాద భీమా 5లక్షల రూపాయల చెక్కును అందజేసిన

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గం:

మద్దిరాల మండల కేంద్రానికి చెందిన కొడవళికంటి యాకయ్య అనే ట్రాక్టర్ డ్రైవర్ పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టి మీద పడటంతో  మృతి చెందడంజరిగింది. ఈరోజు వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2015 వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన డ్రైవర్ ప్రమాద భీమా నుండి మంజూరు అయిన ₹5,00,000/- (ఐదు లక్షల) రూపాయల చెక్కును మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారు  భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం నియోజకవర్గ ఇంచార్జి గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో కొడవళికంటి యాకయ్య భార్య  కవితకు అందజేసారు.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతూ..కెసిఆర్ గారు డ్రైవర్ ప్రమాద భీమా ను 2015 వ సంవత్సరంలో  డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 23 లక్షల మంది ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి ఈ భీమా వర్తిస్తుంది. ఇందులో ఆటో డ్రైవర్లు కార్ డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ అందరికీ పథకం వర్తిస్తుంది. దీనివల్ల ఎవరైనా డ్రైవర్ ప్రమాదంలో చనిపోతే వారి ఆ కుటుంబం రోడ్డు మీద పడకూడదని ఈ భీమా ఆ కుటుంబానికి ఆర్థిక.వెసులుబాటు కల్పించే విధంగా తోడ్పడుతుందని  కేసీఆర్ గారు భావించడం జరిగింది ఈ పథకాన్ని 2015 నుండి 2024 వరకు కొనసాగించడం జరిగింది.

అబ్బదపు హామీలతో అధికారంలోకి వచిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం  పథకాన్ని రద్దు చేయడం జరిగింది . దీనివల్ల రవాణా రంగమే తన ఉపాధిగా భావించే డ్రైవర్ సోదరులు ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురై మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రేస్  ప్రభుత్వంవచ్చి దాదాపు రెండున్నర ఏళ్ళు గడిచిన ముఖ్యమంత్రి గాని రవాణా శాఖ మంత్రి గాని,కార్మిక శాఖ మంత్రి గాని ఇట్టి భీమా పథకము గురుంచి ఎలాంటి సమావేశంనిర్వహించిందేలేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్,రిజిస్ట్రేషన్,టాక్స్ ల ద్వారా వేల రూపాయలు వెహికిల్ ఓనర్స్,డైవర్స్ నుండి వసూలు చేస్తున్న ప్రభుత్వం రవాణా రంగంను నమ్ముకున్న డ్రైవర్లకు మొండి చెయ్యి చూపిస్తుంది 
అదేవిధంగా  ఆటో డైవర్ల భృతి క్రింద సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదు అన్నారు.

ఈ కార్యక్రమంలో మద్దిరాల మండల పార్టీ అధ్యక్షులు SA రజాక్, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకెపెల్లి రఘునందన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కళ్ళేట్లపల్లి ఉప్పలయ్య, గుండగాని సోమేశ్, దావుల వీరప్రసాద్, బెజ్జంకి శ్రీరాం రెడ్డి పోలుమల్ల గ్రామ శాఖ అధ్యక్షులు రేసు వెంకన్న, మండల యూత్ అధ్యక్షులు  నల్ల మధు రెడ్డి పాతూరి లింగారెడ్డి,ఏలేటి మల్లారెడ్డి  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333