సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Aug 27, 2026 - 23:13
Aug 27, 2026 - 23:51
 0  2
సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

తిరుమలగిరి  28 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల పరిధిలోని గుండెపురి గ్రామ కేంద్రంలో 'సర్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొమ్ము సోమన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుమలగిరి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మిలాల్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జుమ్మిలాల్ నాయక్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టిన ఈ 'సర్' కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. సర్పంచ్ కొమ్ము సోమన్న మాట్లాడుతూ గుండెపురి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి