నూతన మండల కమిటి ఎన్నిక చేయడం
మత దురహంకారం కుల వివక్షత సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం పోరాడుతాం
ప్రజా సమస్యలను గుర్తించి ప్రజా పోరాటాలను నిర్మించాలి..
అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నూతన కమిటీల నిర్మాణ ప్రక్రియను చేపట్టాలి
ములుగు, 27 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- నూతన తరాన్ని ఉద్యమంలోకి తీసుకొచ్చి శక్తివంతమైన సైన్యంగా తయారుచేసేందుకు ఎమ్మార్పీఎస్ శ్రేణులు శ్రమించాలని మూడు దశాబ్దాలుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాజీలేని పోరాటం చేసి ఎస్సి వర్గీకరణను సాధించడమే కాకుండా మాదిగల తో పాటు పేద వర్గాల సంక్షేమం కోసం ఉద్యమాలు నడిపి పలు అనేక సంక్షేమ పథకాలు సాధించిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం మత దురహంకారం కుల వివక్షత సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం పోరాడుతుందని ప్రజా సమస్యలను గుర్తించి బలమైన ప్రజా పోరాటాలను నిర్మిస్తుందన అన్నారు. ఈ సమావేశం కన్నాయిగూడెం మండలం ఇన్చార్జి పుల్లూరి కరుణాకర్ అధ్యక్షతన వహించారు.ముఖ్యఅధితులు ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి ములుగు జిల్లా ఇంచార్జి చాతళ్ల రమేష్ మాదిగ పాల్గొనీ మాట్లాడుతూ ఈదేశంలో దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉండడం వలన వివక్షతకు గురై పేదరికంలోనే మిగిలిపోయామని, అణగారిన వర్గాల ఆర్థిక ఎదుగుదలకు పేదరికన్ని నిర్ములించేందుకు ఉద్యమించాలని అన్నారు. రాజకీయ చైతన్యాన్ని సృహను విడువకుండా బలమైన ప్రజా పోరాటాలను నిర్మించాలని అందుకు గ్రామ స్తాయిలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పోరాడాలని అన్నారు.
ఎమ్మార్పీఎస్ అన్ని అనుబంధ విభాగాల కమిటీలు రద్దు ఐనా సందర్బంగా నూతన మండల కమిటీ ఏర్పాటు చేసుకొని అన్ని అనుబంధ విభగాలను సంస్థగతంగా పునరనిర్మాణం చేసుకొని శక్తివంతంగా తయారు చేయాలని అన్నారు. నూతన విద్యార్థి యువ తరాన్ని ఉద్యమంలోకి తీసుకోచ్చి క్షేత్ర స్థాయిలో శ్రమించాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ నూతన మండల అధ్యక్షులు కమిటి అధ్యక్షులు పరికి సురేష్ మాదిగ, అధికార ప్రతినిధి కొడారి సర్వేష్ మాదిగ ఉపాధ్యక్షులు వావిలాల రవీందర్, కార్యదర్శి దేపక సాగర్, ఎం ఎస్ పి అధ్యక్షులు మామిడి నాగ వంశీ మాదిగ, ఎం ఎస్ పి అధికార ప్రతినిధి పడిదెల రాజేందర్ ఎం ఎస్ పి ఉపాధ్యక్షులు దామర రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా సీనియర్ నాయకులు వావిలాల నర్సింగరావు ఏం పెళ్లి లక్మయ్య వావిలాల సాంబశివరావు మామిడి రాంబాబు పరిదల పరిదల సతీష్ దేపక నరేష్ లక్ష్మీనారాయణ ముత్తయ్య అన్నమయ్య వేణుగోపాల్ హనుమంతు చందర్రావు ముత్తయ్య అబ్బాస్ శ్రీను లక్ష్మను బిక్షపతి దీపాక నరేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.