భవన నిర్మాణ కార్మికుల హక్కుల సాధనకై కృషి చేస్తా..
జిల్లా అధ్యక్షుడు దుబ్బల శ్రీశైలం
తెలంగాణ వార్త కొండపాక :- భవన నిర్మాణ కార్మికుల హక్కుల సాధనకై కృషి చేస్తానని భవన నిర్మాణ కార్మికుల జిల్లా అధ్యక్షుడు దుబ్బల శ్రీశైలం తెలిపారు.మంగళవారం మండల పరిధిలోని దుద్దేడ ఎల్లమ్మ గుడి ఆవరణలో మీడియాతో వారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికలలో భవన నిర్మాణ కార్మికుల సహకారంతో మెదక్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా నిలబడతామన్నారు.కార్మికుల పక్షాన ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. కార్మికుల కుటుంబాల్లో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ప్రతి గ్రామంలో చూస్తున్నామన్నారు. 96 జీవో ప్రకారం హక్కుల సాధనకై కార్మికులందరూ పోరాడాలన్నారు.కార్మికులందరికీ లేబర్ కార్డు ఐదు సంవత్సరాలకు ఒకసారి రినివెల్ కాకుండా కార్మికుడు 60 సంవత్సరాలు వచ్చే వరకు లేబర్ కార్డు ఉండాలన్నారు. కార్మికులందరికీ 10 లక్షల బీమా తో పాటు 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి ప్రభుత్వం తరఫున నెలకు 3వేలు ఆర్థిక ప్రోత్సాహం అందజేయాలన్నారు.కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జక్కుల కిషన్, గ్రామ అధ్యక్షుడు పిల్లి భూపాల్,కనకారావు,నబి, దేవరాజు,రామచంద్రం,రాజు, నీల మల్లేశం తదితరులు ఉన్నారు.