భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల వర్ధంతి సభలు

Mar 16, 2025 - 18:36
Mar 16, 2025 - 21:32
 0  8
భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల వర్ధంతి సభలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల వర్ధంతి సభలు ప్రతి గ్రామంలో నిర్వహించాలి* *PYL జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య, పివైఎల్ రాష్ట్ర నాయకులు బండి రవి* దేశ స్వాతంత్రం కోసం, బ్రిటిష్ ముష్కరులు అమలు చేసిన అణిచివేత, దోపిడి, దౌర్జన్యాలకు, సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిరంతర పోరాట స్ఫూర్తితో సాగిన భగత్ సింగ్ రాజగురు, సుఖదేవుల వర్ధంతి సభలు ప్రతి గ్రామ గ్రామాన వాడవాడన నిర్వహించాలని పివైఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని ఏపూర్ గ్రామంలోని జన్ను సార్ స్మారక భవన్లో పివైఎల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పివైఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య, పివైఎల్ రాష్ట్ర నాయకులు బండి రవి పాల్గొని మాట్లాడుతూ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల 94 వ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిధిలోని ప్రతి గ్రామంలో వాడవాడనా భగత్ సింగ్ వర్ధంతి సభలను విస్తృతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా యువకులకు పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయిలో చేగువేరా, ఫైడల్ కాస్ట్రో లాంటి విప్లవ వీరులు అమెరికన్ సామ్రాజ్యవాదుల కబంధహస్తాల్లో అమరులయ్యారని అదే కోవలో భారత ఉపఖండంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో ఉరి తీయబడినరని భగత్ సింగ్ తన సహచరులు కలలుగన్న సార్వభౌమాధికారం, లౌకికవాదం, సోషలిజం కోసం పోరాడుతున్న ఎందరికో గొప్ప స్ఫూర్తినిస్తుందని వారు అన్నారు. భారతదేశన్ని పట్టిపీడిస్తున్న సామ్రాజవాదానికి, పెట్టుబడిదారు వ్యవస్థకు, మతోన్మాదం, కులతత్వాలకు వ్యతిరేకంగా భారతీయ విద్యార్థి, యువతరం, ప్రజలు భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో మోడీ ప్రభుత్వం కుహానా దేశభక్తిని బట్టబయలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న భారత ప్రజలపై అనుసరించే దుశ్చర్యలకు వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 94వ వర్ధంతి సభలను జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లేరు, బతిని ఎల్లయ్య, సుదగాని వెంకన్న, ఉదయ్, కుంట రవి, కొరివి ప్రవీణ్, వరుణ్ సందేశ్, వై మధు, గోపాల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.